బనగానపల్లె: బనగానపల్లెలో పెన్షన్ల పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా బనగానపల్లెలోని ఈద్గా నగర్ ప్రాంతంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పింఛన్ పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేశారు.కూటమి ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీనే పింఛన్ అందజేస్తోందని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం దిశగా పాలన సాగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.