ఒంగోలు అర్బన్: ఒంగోలు పొగాకు వేలం కేంద్రంలో అధికారులకు వార్నింగ్ ఇచ్చిన కలెక్టర్ రాజాబాబు, పొగాకు కొనుగోలు పై ఆరా
Ongole Urban, Prakasam | Jun 28, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పొగాకు వేలం కేంద్రాలను కలెక్టర్ రాజాబాబు తనిఖీ చేశారు. ఉద్దేశపూర్వకంగా పొగాకు తిరస్కరిస్తే కంపెనీలను బ్లాక్ లిస్ట్లో పెడతామని హెచ్చరించారు. ఈ వీడియో ఆదివారం వైరల్ గా మారింది. '140 మిలియన్ KGలకు బోర్డు అనుమతిస్తే రైతులు 230 మిలియన్ కేజీలు పండించారు. వచ్చే ఏడాది 80 మిలియన్ కేజీలకే పర్మిషన్ ఇస్తాం. ఇప్పుడు కేజీ రూ.200 తగ్గకుండా కొనాలి' అని కలెక్టర్ సూచించారు. మరోవైపు రైతులు రూ.250 చొప్పున ఇవ్వాలని వరుసగా ఆందోళనలు చేస్తున్నారు.