నరసరావుపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దర్శించుకున్న పల్నాడు జిల్లా జడ్జి సత్య శ్రీ
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని పల్నాడు జిల్లా జడ్జి సత్య శ్రీ సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు ఆమెకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు సత్య శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేసి అమ్మవారి పట్టుచీర తీర్ద ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.