ఒంగోలు: ఒంగోలు స్వాతంత్ర సమరయోధుడు, వడ్డెర జాతి నాయకుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల .హ
ఒంగోలు. స్వాతంత్ర సమరయోధుడు, వడ్డెర జాతి నాయకుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది.శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఈనెల 11వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా జయంతి వేడుకలు జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిడిపికి చెందిన వడ్డెర సంఘ నాయకులు ప్రభుత్వం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.