అన్నమయ్య: విద్యార్థులకు చట్టాలపై అవగాహన
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మార్గదర్శకత్వంలో శక్తి టీమ్లు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా పోలీసులు ర్యాగింగ్, బాల్యవివాహాలు, డ్రగ్స్, బెట్టింగ్ వంటి సమస్యలు భవిష్యత్తును దెబ్బతీస్తాయని విద్యార్థులకు వివరిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.అలాగే సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు పాటించాలి, రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు. మహిళల భద్రత కోసం 112 నెంబర్, శక్తి యాప్ వినియోగంపై విద్యార్థులకు వివరించారు.