ఫరూఖ్‌నగర్ పరిధిలో శంషాబాద్ డీసీపీ రాజేశ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ ప్రాంతాల్లో పలుచోట్ల తిరుగుతూ వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం లక్ష్యంగా ఇంటింటి తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు ఆటంకాలు కలిగిస్తే చర్యలు తప్పమన్నారు.