కర్నూలు: ముఖ్యమంత్రి జిల్లాల్లో ఇచ్చిన హామీలపై చర్యలు తీసుకోండి: సీసీఎల్ఏ జయలక్ష్మి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలలో ఇల్లు లేని వారికి ఇంటి సౌకర్యం కల్పించడంపై ఇచ్చిన హామీల పై చర్యలు మరియు 3వ విడత రీ సర్వే ను త్వరగా పూర్తిచేసే చర్యలు తీసుకోవాల్సిందిగా సీసీఎల్ఏ జయలక్ష్మి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఉదయం 12 గంటలు విజయవాడ నుండి సీసీఎల్ఏ జయలక్ష్మి అన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.