డోన్: డోన్ లో వాకింగ్ ట్రాక్ నిర్లక్ష్యంపై మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం
Dhone, Nandyal | Apr 5, 2026 నంద్యాల జిల్లా డోన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్&బీ గెస్ట్ హౌస్లో ఆదివారం ఉదయం వాకింగ్ చేశారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ను అధికారులు నిర్లక్ష్యం చేసి నిరుపయోగంగా మారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఎంపీడీవో కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.