ఎంపీ మిధున్ రెడ్డి పై మండిపడ్డ.
రాజంపేట పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి.
ఆర్జే వెంకటేష్.
అన్నమయ్య జిల్లా మదనపల్లి టిడిపి కార్యాలయంలో టిడిపి నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజంపేట పార్లమెంట్ టిడిపిఅధికార ప్రతినిధి . ఆర్ జే.వెంకటేష్ మాట్లాడుతూ మదనపల్లి నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డి మదనపల్లె నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. 2022 సంవత్సరంలోని మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి అన్నారన్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణంలో నాణ్యత లోపించింది అన్నారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.