డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన బాపట్ల జిల్లా నూతన ఎస్పీ ఉమామహేశ్వర్, గంజాయిని ఏరిపారేయాలని పోలీస్ బాస్ ఆదేశాలు
బాపట్ల జిల్లా నూతన ఎస్పీ ఉమామహేశ్వర్ మంగళవారం డిజిపి హరీష్ కుమార్ గుప్తాను పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సందర్భంగా డిజిపి గుప్తా ఆయనకు విధుల నిర్వహణకు సంబంధించి అనేక సూచనలు చేశారు.ప్రత్యేకించి గంజాయిని ఏరిపారేయాలని,మహిళలకు రక్షణ కల్పించాలని,అసాంఘిక శక్తుల ఆట కట్టించాలని ఎస్పీని డీజీపీ ఆదేశించారు. డ్రోన్లు తదితర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని సూచించారు