దేవాలయాల భూములు దేవాలయ శాఖవి కావు : నంద్యాలలో దక్షిణాంధ్ర విహెచ్పి ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Apr 2, 2026
దేవాలయ భూములు దేవాదాయ శాఖకు చెందిన సొంత భూములు కావని VHP దక్షిణాంధ్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పూర్వం దాతలు దేవాలయాల నిర్వహణ కోసమే ఈ భూములను ఇచ్చారని, వాటిని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆలయ భూములను అన్యాక్రాంతం చేస్తే ఉద్య మిస్తామన్నారు. పేదలకు ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ భూములను పంచాలని వారు డిమాండ్ చేశారు