బనగానపల్లె: బనగానపల్లెలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి
నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి శనివారం ప్రారంభించారు. పేదలు, కార్మికులకు నాణ్యమైన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంత్రి, కలెక్టర్ ప్రజలతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.