ఏటూరునాగారం: కొండాయిలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామాలయం వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, సన్నాయి మేళాలు, బతుకమ్మ పాటలతో గ్రామం పండుగ సందడితో నిండిపోయింది.