ఒంగోలు అర్బన్: ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించిన కమిషనర్ వెంకటకృష్ణయ్య
Ongole Urban, Prakasam | Jun 30, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలులో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు ప్రజలు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణయ్య కోరారు. నగరంలోని చెరువుకొమ్ముపాలెంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం అక్కడి స్థానికులతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు పరిసరాల పరిశుభ్రతకు ఎంతగానో పాటుపడుతున్నారని, వారికి మనమంతా సహకరించాలని పేర్కొన్నారు.