ధర్మవరం టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన పరిటాల.
ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పట్టణంలోని టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ధర్మవరం రూరల్ మండలం దర్శనమల గ్రామానికి చెందిన వి అంజినబాయి కి రూ.70000,ముదిగుబ్బ మండలం రాఘవంపల్లికి చెందిన పెన్నబడి వినయ్ కి రూ.19,883 మొత్తం 89,883 విలువైన రెండు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగింది.