ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఏఐటియుసి కార్యాలయంలో డిసెంబర్ 21వ తేదీ దర్శి మండల హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధమ మహాసభ జరుగుతుందని ఏఐటియుసి దర్శి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. ఎదుర్కొనేందుకు కార్మికులు ఐక్యమత్యంగా కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.