ప్రకాశం జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలనుపగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆయన ఛాంబర్ లో ఏపీ టెట్ పరీక్షల నిర్వహణపై అధికారు లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు ఈనెల 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించ డానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఈనెల 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లాలో జరిగే టెట్ పరీక్షలకు 810 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఆయన చెప్పారు. జిల్లాలో టెట్ పరీక్షలు నిర్వహించడానికి 8 కేంద్రాలను ఏర్పాటు చేసామన్నార