ధర్మవరం పట్టణం మార్కెట్ సమీపంలో ట్రాక్టర్ కింద పడి మహిళా రైతు మృతి.
ధర్మవరం పట్టణంలో శుక్రవారం రాత్రి మార్కెట్ సమీపంలోని సులబ్ కాంప్లెక్స్ వద్ద ధర్మవరం మండలం బిల్వంపల్లి గ్రామానికి చెందిన రాములమ్మ (65) అనే మహిళ రైతు ట్రాక్టర్ కిందపడి మృతి చెందింది. తమ గ్రామానికి వెళ్లే క్రమంలో ఆటో స్టాండ్ వద్దకు వెళుతున్న రాములమ్మను వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.