ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ లో 36,00,530 సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం మంజూరైన 36,00,530 విలువైన చెక్కులను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ లబ్ధిదారులకు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్య ఖర్చులు భరించాలని పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఊరట నిస్తుందన్నారు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా తాము నిరంతరం కృషి చేస్తున్నామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు