చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు రహదారి పక్కన కనుమ పండుగ సందర్భంగా కోడిపందాలు శుక్రవారం ఏదేచ్ఛగా కొనసాగాయి. ఒక్కొక్క పందానికి పందెపు రాయుళ్లు లక్షలాది రూపాయలు ఒడ్డుతున్నారు. కోడిపందాలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనాలు భారీగా తరలి రావడంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. మరోవైపు అక్కడికి వచ్చిన వారికోసం నిర్వాహకులు దుకాణాలను సైతం ఏర్పాటు చేశారు. యదేచ్చగా కోడిపందాలు కొనసాగుతున్నప్పటికీ నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికుల నుండి విమర్శలు వినవస్తున్నాయి.