గుంతకల్లు: పట్టణంలో సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నాయకులు రిలే దీక్షలు, సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని అన్ని వార్డులలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక రిలే దీక్షలు గురువారం మూడవ రోజుకి చేరాయి. సీపీఐ నాయకులు చేపట్టిన సామూహిక రిలే దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని వార్డులలో డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.