ఉరవకొండ: బెలుగుప్ప శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట వార్షిక పూజలు మహా సుదర్శన హోమాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీవిఘ్నేశ్వరస్వామి ఆలయంలో గురువారం ధ్వజస్తంభ ప్రతిష్ట వార్షిక పూజలు హోమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు స్వామి వేదపండితుల బృందం కలసి మహాగణపతి పూజ గణపతి హోమం నవగ్రహ హోమం మహా సుదర్శన హోమాలను నిర్వహించారు. అనంతరం మహా మంగళహారతి నిర్వహించారు. పూజలో భాగంగా తీర్థప్రసాద పంపిణీని ఆలయ సేవా కమిటీ సభ్యులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.