నంద్యాల అర్బన్: జన గణనలు స్వీయ నమోదు విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 17, 2026
జనగణన-2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వయంగా అధికారిక వెబ్సైట్ https://se.census.gov.in ద్వారా తన కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. జిల్లాలోని ప్రతీ కుటుంబం జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.