వ్యవసాయ అనుబంధ ప్రాసెసింగ్ యూనిట్లకు 50 శాతం రాయితీతో సన్నకారు రైతులకు ప్రభుత్వం చేయూత: డీఆర్డీఏ వెలుగు పీడీ నారాయణ
Ongole Urban, Prakasam | Jul 11, 2025
వ్యవసాయం దాని అనుబంధం సంఘాల జీవనోపాదులు పెంపొందించడంలో రైతులకు వెన్నుదన్నుగా రైతు ఉత్పత్తిదారులు సంస్థ యఫ్పిఓ నిలబడాలని డిఆర్డిఏ వెలుగు పీడీ నారాయణ అన్నారు. దీనిలో భాగంగా రైతులు పండించిన పంటలు ప్రాసెసింగ్ యూనిట్లు మునగా, వెదురు సాగు, తేనె తీగల పెంపకం, షేడ్ నెట్, ఫీష్ కంటినూషన్, సోలార్ డ్రయ్యర్స్ వినియోగంపై 50% రాయితీలు చిన్నా సన్నకారు రైతులకు ప్రభుత్వం అందిస్తుంది అని తెలిపారు. 12 మండలాల ఎఫ్.పి.వోలు, సీసీలు, ఎఫ్ఎల్ఓ లకు శుక్రవారం సాయంత్రం ఒంగోలులో సమావేశం నిర్వహించారు.