తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం బూదనం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో సుమారు ఒక కిలోమీటరు దూరం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నెల్లూరు నుంచి చెన్నైవైపు వెళ్తున్న లారీని వెనక నుంచి అదే మార్గంలో వస్తున్న మరో లారీ ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. హైవే సిబ్బంది క్రేన్ సహాయంతో లారీని పక్కకు పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు.