కనగానపల్లిలో రైతులకు వాటర్ మెయింటెనెన్స్ బిల్లులు సకాలంలో చెల్లించాలని ఎమ్మార్వో కు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం .
కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం 12 గంటల 45 నిమిషాల సమయంలో రైతులకు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ విధులు వాటర్ మెయింటెనెన్స్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కనగానపల్లి ఎమ్మార్వో కు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బాలరాజు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహాదేవ మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులు సకాలంలో చెల్లించడం లేదని రోడ్లు పూర్తయి సంవత్సరం కావస్తున్న ఆ నిధులు విడుదల కావడం లేదని. అదే విధంగా రైతులకు వాటర్ మెయింటినెన్స్ బిల్లులు కూడా చెల్లించడం లేదని, ఈ సమస్యపై ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కనగానపల్లి సిపిఐ నేతలు పేర్కొన్నారు.