బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలంలో పెళ్లి ఇంట్లో విషాదం
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం మదనంతపురంలో పెళ్లింట విషాదం నెలకొంది. బుధవారంగ్రామానికి చెందిన సద్దల గంగ శివుడు (32) తన అన్న కుమారుడి వివాహం కావడంతో పెళ్లి పందిరి కోసం టెంకాయ పట్టల కోసం వెళ్లాడు. గ్రామ సమీపంలో టెంకాయ చెట్టు ఎక్కి పట్టలు కొడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.