జహీరాబాద్: మున్సిపల్ కార్యాలయంలో బిఎల్వోలకు ఓటరు జాబితాలపై అవగాహన
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ జాబితా సవరణలపై బిఎల్ఓ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో తహసిల్దార్ దశరథ్, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు పాల్గొని బి ఎల్ ఓ లకు ఓటరు జాబితా సవరణలు, నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండే విధంగా చూడాలన్నారు.