హత్నూర: దుర్వాసన భరించలేమంటూ సుగుణ పౌల్ట్రీ ఫుడ్ కంపెనీ ఎదుట పోతుల బొగడ గ్రామస్తుల ధర్నా
సుగుణ పౌల్ట్రీ ఫుడ్ కంపెనీ నుంచి వస్తున్న దుర్వాసన భరించలేకపోతున్నామంటూ గ్రామస్తులు బుధవారం కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలంలోని పోతల బోగడ గ్రామ శివారులో ఉన్న సుగుణ పౌల్ట్రీ ఫుడ్ కంపెనీ నుంచి విరద జలాలు వదలడంతో గ్రామంలోకి దుర్వాసన వస్తుందని భరించలేకపోతున్నామని గ్రామస్తులు బుధవారం సుగుణ పౌల్ట్రీ ఫుడ్ కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కంపెనీ వదిలే విడుదల వల్ల చెరువులు కలుషితమవుతున్నాయని విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.