బర్కత్పురా బీజేపీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. గురువారం నిర్వహించిన సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించిన కార్పొరేటర్లను పోలీసులతో బయటకు గెంటించారని మండిపడ్డారు. డివిజన్లకు రావాల్సిన నిధులు అడిగితే అరెస్టులు చేయిస్తున్నారని శ్రీవాణి ఆరోపించారు.