ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ఆపరేషన్ వజ్రప్రహార్.
Ongole Urban, Prakasam | Apr 12, 2026
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడిని లక్ష్యంగా చేసుకుని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు అధ్వర్యంలో ఒంగోలు టు టౌన్ సీఐ యం.శ్రీనివాసరావు, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, కొత్తపట్నం ఎస్సై సుధాకర్ మరియు 7 మంది ఎస్సైలు , 50 మంది పోలీస్ సిబ్బంది కొత్తపట్నంలోని మరియు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.