ఒంగోలు అర్బన్: 10వ తేదీన అదృశ్యమైన గిద్దలూరు కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి నరసరావుపేటలో సురక్షితంగా ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడి
Ongole Urban, Prakasam | Jun 16, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు ప్రశాంత్ నగర్ కు చెందిన జమ్మలమడుగు ప్రసాద్ ఈనెల 10వ తేదీ నుంచి కనిపించకుండా అదృశ్యమయ్యాడు. వ్యక్తిగత పనులపై ఇంటి నుంచి వెళ్లిన ప్రసాద్ తిరిగి ఇంటికి రాలేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు ప్రసాద్ అదృశ్యమైనట్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ప్రసాద్ నరసరావుపేటలో సురక్షితంగా ఉన్నట్లుగా గుర్తించామని కుటుంబ సభ్యులు మీడియాకు వివరాలు వెళ్లడించారు.