అమలాపురంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆద్వర్యంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించిన కేంద్ర పోలీసు బలగాలు#@
రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు శాంతి భద్రతల దృష్ట్యా ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చిన కేంద్ర బలగాలతో అమలాపురం పట్టణంలో ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల విషయమై ప్రజలకు భరోసా కల్పించటానికి కేంద్ర బలగాలు అమలాపురం ఎస్ కెవిఆర్ కాలేజీ నుండి పట్టణంలోని పలు వీదుల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఎస్కేబీర్ కళాశాల వద్ద జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా, ఎస్పీ శ్రీధర్ లు జెండా ఊపి పోలీస్ కవాతును ప్రారంబించారు.ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.