మహబూబ్ నగర్ అర్బన్: ఏబీవీపీ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ధర్నా.. పోలీసులతో వాగ్వాదం
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఫీజులు చెల్లించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.ఈ ర్యాలీ తెలంగాణ చౌరస్తాకు చేరుకోగానే ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అరెస్టుకు యత్నించగా, విద్యార్థులు ప్రతిఘటించారు. అనంతరం వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు