ఒంగోలు అర్బన్: ఈవీఎం కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 27, 2026
కలెక్టర్ రాజాబాబు శనివారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి స్థానిక భాగ్యనగర్ లో ఉన్న ఈవీఎం గోదామును సందర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం త్రైమాసిక పరిశీలనలో భాగంగా గోదాము తలుపులు తెరిచి, అందులో భద్రపరచిన వీవీ ప్యాట్లు, కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లను పరిశీలించారు. వాటి పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మాధురి, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరంటెండెడ్ శ్రీనివాసరావు, తహసిల్దార్ కృష్ణమోహన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు