ఉరవకొండ: గంజికుంట ప్రణవానంద ఆశ్రమంలో ఘనంగా శివస్వరూపానందగిరి స్వామి ఆరాధన మహోత్సవం
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజికుంట గ్రామంలో ఉమామహేశ్వర గురు పీఠం శ్రీ ప్రణవానంద ఆశ్రమ మఠంలో శివస్వరూపానందగిరి గురువర స్వాముల వారి 28వ ఆరాధన మహోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి సద్గురువుల మధ్య భక్తజనం ఘనంగా నిర్వహించారు. ఆదివారం నుండి మూడు రోజులపాటు గురు మహాత్ముల ఉపన్యాసములు మంత్రపుష్పం పూజలు నిర్వహించనున్నారు. మొదటిరోజు శ్రీ పరమేశ్టి గురు శ్రీ ప్రణవానంద సద్గురువుల పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గురువుల ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించారు.