ఒంగోలు అర్బన్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలి: జిల్లా కలెక్టర్
Ongole Urban, Prakasam | Jun 3, 2026
స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్-2026)పై అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సిఇఓ వివేక్ యాదవ్ తో కలసి సమీక్ష నిర్వహించి, దిశా నిర్దేశం చేసారు. ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని, క్షేత్రస్థాయిలో బిఎల్ఓల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు