నంద్యాల అర్బన్: మహానంది క్షేత్రంలో ఘనంగా గంగా జయంతి వేడుకలు, పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు
Nandyal Urban, Nandyal | Apr 23, 2026
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో గంగా జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గురువారం ఈవో శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ వేదమంత్రాల మధ్య ఉత్సవం నిర్వహించారు. రుద్రగుండం పుష్కరిణిలో అమ్మవారిని కొలువుదీర్చి విశేష అభిషేకార్చనలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ఇవాళ ఈ కోనేరులో స్నానం చేస్తే పుష్కర స్నాన ఫలం దక్కుతుందని పండితులు వివరించారు.