కనిగిరి: పట్టణంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీ
కనిగిరి పట్టణంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బంది ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి శనివారం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమాకాంత్ మాట్లాడుతూ... పీఎం సూర్య ఘర్ పథకం సోలార్ విద్యుత్ వాడుకోదలిచిన వినియోగదారులకు సోలార్ పలకలపై 12 శాతం ఉన్న జీఎస్టీని ప్రభుత్వం 5 శాతానికి తగ్గించిందన్నారు. ఈ నిర్ణయంతో సోలార్ విద్యుత్ వినియోగదారులకు రూ .12,000 లు ఆదావుతుందన్నారు. వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.