ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరతపై: భారత్ పెట్రోల్ బంక్ వద్ద వైసీపీ నేతలు నిరసన
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం కడప రోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో గత వారం రోజులుగా పెట్రోల్, డీజిల్ విషయంలో కూటమి ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తోందని ఆరోపించారు. “నో స్టాక్” పేరుతో పెట్రోల్ బంక్‌లలో సరఫరాను నిలిపివేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకుగురిచేస్తున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిప