అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలోని గోరాన్ చెరువు గ్రామం గొల్లపల్లి వద్ద శనివారం సాయంత్రం కారు ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ ఈశ్వరయ్య తన సొంత వాహనం షిఫ్ట్ డిజైర్లో డ్యూటీ నిమిత్తం రాయచోటికి వెళుతుండగా గొల్లపల్లి వద్ద అదుపుతప్పి సైడ్ ఉన్న రాయిని ఢీకొట్టాడు.ఈ ఘటనలో కారులో ఒక్కరే ఉన్న ఈశ్వరయ్య ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.