నంద్యాల అర్బన్: నంద్యాలలో వాల్మీకి నేత హౌస్ అరెస్ట్
Nandyal Urban, Nandyal | Jul 9, 2026
సీఎం చంద్రబాబు బనగానపల్లెపర్యటన నేపథ్యంలో మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పులికొండన్నను నంద్యాలలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. వాల్మీకి జాతి ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా వాల్మీకి సంఘాలు, నేతలు మండిపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.