ఆళ్లగడ్డ: సరికొత్త అందాలతో మురిసిపోతున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలం
ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో ఆలయ పరిసరాలు సరికొత్త అందాలతో భక్తి భావాన్ని పంచుతున్నాయి, దాతల సహకారంతో గ్రామ ప్రవేశంలో గరుత్మంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, దారి పొడవునా నృసింహ నామంతో కూడిన విద్యుత్ దీపాలను అమర్చారు, ప్రధాన తిరువీధిలో స్వామివారు స్తంభం నుంచి ఉద్భవించిన అద్భుత దృశ్య విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది