నంద్యాల అర్బన్: సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు ప్రోటోకాల్ కు అనుగుణంగా పకడ్బందీగా పూర్తి చేయాలి . మంత్రి, కలెక్టర్
Nandyal Urban, Nandyal | Jul 7, 2026
ఈనెల 9వ తేదీన బనగానపల్లెలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం శంకర స్థాయిలో పరిశీలించారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ వీరి వెంట ఉన్నారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన హెల్ప్ తాసిల్దార్ కార్యాలయం ప్రజావేదికతో పాటు ఇతర కీలక ప్రాంతాలను సందర్శించి వివిధ శాఖల అధికారులు చేపట్టిన ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు