కడప: కడప నగరంలో గంజాయి, నిషేధిత మత్తు పదార్థాలు సేవించే వారిపై, అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా
Kadapa, YSR | Oct 29, 2025 గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవనం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది అత్యాధునిక డ్రోన్ కెమెరాల సాయంతో నిఘా ఉంచేలా చర్యలు చేపట్టారు. కడప తాలూకా సి.ఐ టి.రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఎస్.ఐ తులసి నాగప్రసాద్ ఆయా ప్రాంతాలను జల్లెడ పట్టారు.