ఒంగోలు అర్బన్: వైసీపీ నాయకులకు అభివృద్ధి కనబడడం లేదా మహిళలను కించపరచడం సభవేనా : ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jun 18, 2026
ఒంగోలు నగరంలోని SGVS ఫంక్షన్ హల్ నందు కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఒంగోలు నియోజకవర్గం మరియు ప్రకాశం జిల్లా విజయోత్సవ సభలో సభలో మంత్రులు రవి,స్వామి,రామనారాయణ రెడ్డి తో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్ మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్ళలో సాగుతున్నాయి అన్నారు