నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టులో నీట మునిగి యువకుడి మృతి : ఎస్సై భార్గవ్
నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టులో నీట మునిగి ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం 7 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్ వివరాలు.. మెదక్ జిల్లా కు చెందిన షేక్ మహబూబ్(20) సంవత్సరాలు తన స్నేహితునితో కలిసి ప్రాజెక్టు దిగువన ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో షేక్ మహబూబ్ నీట మునిగిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు నుంచి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై భార్గవ్ తెలిపారు.