మహానంది మండలం బొల్లవరం గ్రామంలో పెద్దమ్మ తల్లి 16 రోజుల పండుగ ఘనంగా నిర్వహించడం గ్రామస్తులు
మహానంది మండలం బొల్లవరం గ్రామంలో 16 రోజుల పండుగను బుధవారం వైభవంగా నిర్వహించారు. ఇటీవలే గ్రామంలో పెద్దమ్మ తల్లి దేవరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.అందులో భాగంగా పెద్దమ్మతల్లి దేవర అనంతరం 16 రోజుల పండుగ జరుపుకుంటారు.గ్రామ పొలిమేర రెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజల ఆధ్వర్యంలో పొలిమేర పెద్దమ్మ తల్లి దగ్గర అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి చల్లంగా చూడమ్మా అంటూ భక్తులువేడుకున్నారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ ఐ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.