నందికోట్కూరు: తిరుపతిలో ఫ్లైఓవర్ నుంచి దూకిన పారుమంచాల యువతి మృతి
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామానికి చెందిన యువతి ఆదిలక్ష్మి తిరుపతిలో ని గరుడ వారధి ఫ్లైఓవర్ నుంచి కరకంబాడి లీలామహల్ సర్కిల్ మార్గంలో కిందకు దూకి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే, తిరుపతికి వలస వెళ్లిన అన్న స్వాములు చెల్లెలు ఆదిలక్ష్మి ఒక ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు, ఈ క్రమంలో ఫ్లైఓవర్ నుంచి దూకిన ఆదిలక్ష్మిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం ఆదిలక్ష్మి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందింది.