సర్వేపల్లి: ఈనెల 30 వరకు ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకోండి : మడమనూరులో జనసేన నేత సురేష్ పిలుపు
ఈనెల 30 వరకు ఇల్లు లేని వారందరూ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సర్వేపల్లి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ సురేష్ నాయుడు పిలుపునిచ్చారు. మనుబోలు మండలం మడమనూరులో గురువారం సాయంత్రం ఆయన పర్యటించారు. ఎస్టీ బీసీ కాలనీలో పర్యటించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వాటర్ వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చారని.. వాటికి త్వరలోనే పరిష్కారం మార్గం చూపుతామని ఆయన స్పష్టం చేశారు